పిడికిలి బిగించు!!;- -గద్వాల సోమన్న,9966414580
మెండైన  దేశభక్తి
గుండెల్లో నింపుకో! 
పేదల పట్ల అనురక్తి
చేతల్లో చాటుకో!

పెద్దల యెడల గౌరవాన్ని
కొండంత పెంచుకో!
మనసులో శత్రుత్వాన్ని
ఆదిలోనే త్రుంచుకో!

గురుదేవుల సన్నిధిలో
జీవితాన్ని దిద్దుకో!
మహనీయుల దారిలో
గమ్యాన్ని చేరుకో!

బాలికల ఉన్నతికై
కంకణం కట్టుకో!
దేశాభివృద్ధి కొరకు
పోరాడుము కడవరకు


కామెంట్‌లు