నిత్య సత్యాలు;- -గద్వాల సోమన్న,9966414580
గురువులను వేడితే
అజ్ఞానం దూరం
తరులను నాటిటే
ఆరోగ్యం సొంతం

పుస్తకం చదివితే
విజ్ఞానం దొరుకును
మస్తకం వెలిగితే
జీవితాలు మారును

అక్షరం నేర్పితే
ఆనందం విరియును
స్ఫూర్తిని గైకొంటే
కీర్తి ఇక వశమగును

కష్టాన్ని నమ్మితే
ఇష్టాలు నెరవేరు
మాట మీద ఉంటే
గౌరవం సమకూరు


కామెంట్‌లు