నిజమేగా!!;- -గద్వాల సోమన్న,9966414580
ప్రణాళికబద్దంగా చదివితే
ఉన్నత ఫలితాలిక  సుసాధ్యమే!
క్రమశిక్షణ కలిగి జీవిస్తే
భవిత బంగారుమయం ఖాయమే!

అక్షరాల  వనమున విహరిస్తే
అజ్ఞానమిక పటాపంచలే!
నైతిక విలువలు కల్గియుంటే
సమాజాన గౌరవం దక్కులే!

పెద్ద వారిని గౌరవిస్తే
జీవితాన శుభసూచికాలే!
కన్నవారిని సేవిస్తే
కుటుంబాన ఆశీర్వాదాలే!

పసి పిల్లలు ఇంట ఉంటే
అనుక్షణం ఆనంద జాతరలే!
గురుదేవులు వెంట ఉంటే
విజ్ఞాననిధులు కోకొల్లలే! 


కామెంట్‌లు