కలం కన్నీరు!!...;- -గద్వాల సోమన్న,9966414580
నైతిక విలువలు తరిగిపోతుంటే
ఎండమావి పగలబడి నవ్వుతుంది
మానవత్వం కనుమరుగవుతుంటే
నేతి బీరకాయ తడుముకుంటుంది

పవిత్రమైన ప్రేమ ఇంకిపోతుంటే
భూమత చూడు కంటతడిపెడుతుంది
సమ న్యాయం తలక్రిందులవుతుంటే
న్యాయ దేవత గాంధారి అవుతుంది

స్వేచ్ఛ కాసింత అధికమవుతుంటే
విచ్చలవిడితనం పెట్రేగిపోతుంది
చిన్నాపెద్దా తేడా లేకుండా
మనిషితనమూ దిగజారిపోతోంది

నాలుగు పాదాలు నడవాల్సిన
ధర్మం చతికిలపడిపోతుంటే
కలం కన్నీరుమున్నీరవుతుంది
నింగి సిగ్గుతో తలదించుకుంటుంది


కామెంట్‌లు