కథలు కథలుగా మన చరిత్ర మొత్తం
వనాల జనాల నుండి కదా మరి
నవనాగరికతా మూలము ఉండగ
పక్కా విదేశీ నగరవాసిగా
వగలుపోతావెందుకు నువ్వు
నవ్వినవ్వి నవనాడులు కృంగి
వీచిన చిరుగాలికి ఎగిరే
చిత్రమైన చిరు కాగితంలా
కవన భువనపు జలధరార్భటులు
జనజాతరల ఉద్ఘోషలు భారతాన
నవనవోన్మేష సవ్వడులు ఆకర్ణించలేదా
దీదివిగా నిలిచిన భారతము కనలేదా
పిక్కటిల్లిన మనవీరుల సింహనాదము వినలేదా
కనలేదా మన సస్యశ్యామల ధాత్రి అందములు
సరిసరి చాలు ఆ మమ్మీల గిమ్మిక్కులు
దామము వేయు మన భరతాంబ మెడలొ
సత్పుత్రుడిలా!!
{జలదరార్భటులు=మేఘము యొక్క గర్జనలు;
ఉద్ఘోషలు=ప్రకటనలు;దీదివి=స్వర్గము;
పిక్కటిల్లిన=నిండిన;దామము=దండ}
**************************************
సత్పుత్రుడు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి