ఆహారశుద్ధి;- సి.హెచ్.ప్రతాప్

 మనం భోజనం చేసే విధానం ఏదైతే ఉంటుందో అది ఎంత శాస్త్రానుసారం ఉంటుందో మన జీవితం మీద కూడా దాని ప్రభావం అంతే ఉంటుంది. మనం ఏ విధంగా అయితే భోజనం చేస్తున్నామో.. ఏ దిశలో కూర్చుంటున్నాము. అలాగే మనం భోజనంలో ఎటువంటి ఆహారం అనేది మనం తీసుకుంటున్నామో.. దానిపైన మొత్తం జీవితమనేది ఆధారపడి ఉంటుంది. మనకి జరిగే మంచి, చెడులు ప్రతి భోజనం చేసేటప్పుడు ఎంతో శుద్ధిగా అలాగే మంచి ఆలోచనతో ఉండాలి. భోజనం చేసే ముందు, పూర్తయిన తర్వాత భగవంతునికి ఆ ఆహారం మనకు అందించినందుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు అర్పించుకోవాలి. భోజనాన్ని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా అనుకోరాదు. మన శక్తి సామర్ధ్యాలు, తెలివితేటల వలనఏ ఇంక మంచి ఆరోగ్యకరమైన భోజనం మనకు లభించిందని అహంకారంతో విర్ర వీగరాదు. భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మిమ్మల్ని ఎంతో అవమానించి భోజనం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి చోటన భోజనం చేయకూడదు. మిమ్మల్ని అవమానించి దాని తర్వాత భోజనం పెడితే మాత్రం అది అసలు తీసుకోకూడదు. ఇక భోజనం చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం భోజనానికి అంటే అన్నపూర్ణ దేవికి  కి దండం అనేది పెట్టుకోవాలి.  భోజనం చేసేటప్పుడు సాధ్యమైనంతగా మౌనంగా వుండాలి.మొదటి మూడు ముద్దలు కానీ మీరు మౌనవహించి తీసుకుంటే మీకు మనశ్శాంతి దొరుకుతుంది. ఉత్తర దిక్కున కూర్చుని మనం భోజనం చేస్తే మనకి మంచి విద్య అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే అది సరస్వతి దేవి దిక్కు కాబట్టి.. పోరపాటును కూడా దక్షిణ దిశలో కూర్చుని భోజనం అనేది చేయరాదు. అది ఆయుక్షీణం.
ఆహార శుద్ధౌ సత్త్వ-శుద్ధిః      సత్త్వ-శుద్ధౌ ధ్రువ స్మృతిహి
స్మృతి-లంభే సర్వ-గ్రంథినాం     విప్ర-మోక్షః"         [ఛందోగ్య ఉపనిషద్ 7.26.2]
"ఆహారం యొక్క స్వచ్ఛత ద్వారా, అంతర్గత స్వభావం యొక్క శుద్దీకరణను అనుసరిస్తుంది, అంతర్గత స్వభావం యొక్క స్వచ్ఛతపై జ్ఞాపకశక్తి దృఢంగా మారుతుంది మరియు జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడం ద్వారా అన్ని బంధాల సడలింపును అనుసరిస్తుంది మరియు జ్ఞానులు తద్వారా ముక్తిని పొందుతారు."
ఈ పద్యం ఆధ్యాత్మిక పురోగతిలో కీలకమైన అంశంగా "ఆహార శుద్ధి" లేదా ఆహారాన్ని శుద్ధి చేయడం గురించి ప్రస్తావించింది.  శుద్ధి చేసేవారిలో గొప్పది స్వచ్ఛమైన ఆహారం అని స్మృతులు ప్రకటిస్తున్నాయి. కనుక ఆహారం స్వీకరించేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలి.  

కామెంట్‌లు