స్వయంకృషి! అచ్యుతుని రాజ్యశ్రీ

 బాల్యం నుంచి ఎవరి పనులు వారు చేసుకోవాలి అని నేర్పే బాధ్యత పెద్దలది.మూడోఏడు రాగానే చిన్న పనులు చేయటం అంటే తనంత తానే అన్నం తినటం చెప్పులు వేసుకోడం పెద్దలు చెప్పిన చిట్టి పనులు చేయడం లో పిల్లలకి ఆనందం కూడా.పూర్వం గురుకులాల్లో 5వ ఏడురాగానే పంపేవారు.మన శ్రీరామ శ్రీకృష్ణులు అలా ఉన్నవారే కదా? స్వశక్తితో పాటు ఇతరులకు సాయం చేసే గుణం కూడా అలవడుతుంది.
పర్షియా రాకుమారుడు గుష్టప్.తండ్రి నిరాదరణ తో అతను పశ్చిమ దేశాలకి దేశ ద్రిమ్మరిగా తిరుగుతూ ఆకలిబాధకు తట్టుకోలేక రాజు దగ్గరకు వెళ్ళి "నాకు చదువటం రాయడం వచ్చు.పని ఇవ్వండి" అని అడిగాడు.రాజు నిరాకరించడంతో ఒంటెలు పెంచేవాడిదగ్గర చిన్న పనులు చేసి పొట్ట నింపుకున్నాడు ఇచ్చిన ఆహారం తో! ఆపై కమ్మరి కొలిమి దగ్గర పనిచేస్తూ సమ్మెట దెబ్బ వేయలేక పనిలోంచి తీసి వేయబడ్తాడు. మళ్లీ పానిక్ వెతుక్కుంటూ రైతు దగ్గర పనివాడు గా చేరాడు. ఇతరులకు సాయం చేస్తూ మంచిపేరు సంపాదించి పర్షియన్ కథల్లో చిరంజీవి గా మిగిలాడు.🌷
కామెంట్‌లు