పాండవుల అజ్ఞాతవాసం! అచ్యుతుని రాజ్యశ్రీ

 12ఏళ్ళ అరణ్యవాసం తర్వాత ఓఏడాది ఎవరికి తమ గుట్టు బయట పడకుండా మారువేషంలో గడపాలి పాండవులు.ఒకవేళ వారిని ఎవరైనా గుర్తిస్తే మళ్ళీ అరణ్యవాసం 12ఏళ్ళు చేయాలి.ధర్మరాజు ఎంతో ఆలోచించి ఎక్కడ సురక్షితంగా ఉంటుందా అని అన్ని రాజ్యాలు ప్రాంతాల్ని గూర్చి ఆలోచనలు చేశాడు.ఆఖరికి ఓరాజ్యంని ఎన్నుకున్నారు.ఆయన ధర్మం కాపాడుతుంది.పురోహితుడు ధౌమ్యుడు మాత్రం ఉన్నాడు వెంట.బాగా ధనధాన్యాలతో సుసంపన్నం గా ఉన్న రాజ్యం మత్స్య దేశం.విరాటరాజు ధర్మాత్ముడు.సుజనహితుడు.కరువున్న ప్రాంతం లో ధర్మరాజు అడుగు వేస్తే వర్షాలు కురుస్తాయని పంటలు పండుతాయి అని అందరికీ తెలుసు.దానివల్ల వారి గుట్టు బైటపడ్తుంది.జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు.విరాటరాజుకి పాచికలు ఆడటం సరదా.తనుకూడా కాలక్షేపం కోసం ఆయన తో ఆడి మన్నన పొందవచ్చు.పైగాపాండవులతో పాటు ద్రౌపది ఉంది.ఆమెకు రక్షణ కావాలి.సౌందర్యరాశి కాబట్టి ఎవరికంటా పడకుండా రాణీ దగ్గర భద్రంగా ఉంటుంది.తమని తాము గుట్టుగా ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉండాలి.కానీ ఐదుగురు ఒకేచోట ఉండి తీరాలి.ఇన్నిరకాలుగా ధర్మరాజు ఆలోచించి తాను కంకుభట్టుగా వేషం కట్టాడు.ఆయన మాటలు ధర్మబద్ధంగా ధర్మసూక్ష్మంతో వివేకం తో కూడినవి.చూశారా! మనం అనుకుంటాం ధర్మరాజు  ఏమి పట్టించుకోలేదు భార్య నా దుర్యోధనుడు దుష్ట చతుష్టయం అవమానం చేస్తున్నా చూస్తూ కూర్చున్నాడు అని.కానీ ఆయన ఎంతో ఆలోచించి ఆవేశపరుడైన భీముడిని తీయని ఒకటి రెండు మాటల్తో చల్లార్చే వాక్పటుత్వం ఉన్న వాడు.అన్నగా బాధ్యత బరువులు మోసిన వాడు.🌷
కొసమెరుపు..సుచీంద్ర క్షేత్రం లో ధర్మరాజు విగ్రహం ఉంది.ఆవిగ్రహంచెవిలో పుల్లపెడ్తే ఈ చెవిలో నుంచి వెళ్ళి అవతలిచెవినుంచి బైటికొస్తుంది.అంటే అనవసరపు మాటలు వినపడ్తే బుర్రలో పెట్టుకుని మనసుపాడుచేసుకోక‌ అప్పుడే దాన్ని విడిచిపెట్టే యి అని దాని భావం.🌸
కామెంట్‌లు