'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 35.
ఉత్పలమాల.
గారపు బిడ్డవంచు మమకారము తోడ యశోద పెంచి బం
గారపు కొండ!దా!యనుచు  కమ్మగ బెట్టుచు భక్ష్యభోజ్యముల్
చేరి భుజించు నిన్ గనుచు సేవలు చేసెడి తల్లి భాగ్యమున్
సారెకు తల్చి పొంగి నిను సన్నుతి చేసితి భక్తిగన్ హరీ!//

36.
ఉత్పలమాల.
కల్లలు చెప్పనేల? కని కట్టును జేయుచు నుండనేల? నీ
యల్లరి సైపలేక మరియాదను మీరిన వాడవంచు నీ
తల్లికి తెల్పి గొల్లెతలు దండన సేయగ బూనగన్ వెసన్
గొల్లున నవ్వు నిన్ దలచి కూరిమితో భజియించితిన్ హరీ!//

కామెంట్‌లు