ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య- ఎం.ఎన్.ఓ సిరిమల్ల మహేష్

 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రుల తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఎఫ్ఎల్ఎన్ మండల నోడల్ అధికారి సిరిమల్ల మహేష్ అన్నారు. సోమవారం ఆయన కాల్వశ్రీరాంపూర్ జడ్పీ హైస్కూల్లో ప్రారంభమైన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు   ప్రధానోపాధ్యాయురాలు నరెడ్ల సునీతతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన విద్యా విధానాలకనుగుణంగా మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఏర్పాటు చేసి, పగడ్బందీగా వృత్యాంతర శిక్షణనిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా విధానాలను మెరుగుపరిచి, పాఠశాల పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం అమలు తీరుపై సమీక్షించారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులచే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రదర్శన, మాదిరి పాఠం చెప్పించారు. కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు నరెడ్ల సునీత, తెలుగు, గణితం, ఇంగ్లీష్ రిసోర్స్ పర్సన్లు పి. రవీందర్ రెడ్డి ఈర్ల సమ్మయ్య, దేవేందర్, సీఆర్పి కుంట కుమారస్వామి, మండలంలోని ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు