'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 51.
ఉత్పలమాల.
'అన్న!'యటంచు ద్రౌపది సహాయముఁ గోరుచు నిన్ను బిల్వ నా
పన్న కరంబు నిచ్చుచు సువాసిని మానము నిల్పినావు నిన్
జెన్నుగ దల్చుకొంచు బహు సిద్ధులు పొందిరి యోగులెల్లరున్
వెన్నుడ!నా దెసన్ గనుచు విన్నపముల్ విన రమ్ము!శ్రీహరీ!//

52.
ఉత్పలమాల.
సారథి వీవు పౌషమున జక్కగ ద్రోల రథంబు నుద్ధతిన్
గౌరవ సేనలన్ దునిమి కాలుని వోలె కిరీటి గెల్చె నీ
సారవిహీనమౌ బ్రతుకు చక్రము నందున బొర్లు చుంటి నా
సారథి వై మెలంగుచు విచారముఁ దూరము సేయవే హరీ!//

కామెంట్‌లు