శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
291)పవనః -

సకలమును పవిత్రమొనర్చువాడు 
మలినరహితుడైనట్టి వాడు
శూన్యమును నింపినట్టివాడు 
గాలిని ప్రసరించుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
292)పావనః -

వాయువునందున్నట్టి వాడు
చలనశీలతను కలిగించువాడు
విశ్వములో సంచరించువాడు 
అంతయును నిండినట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
293)అనలః -

ప్రాణాధారమయినట్టివాడు
చేతనాగ్ని స్వరూపమైనవాడు
కదలికలనిచ్చునట్టివాడు
అనల స్వరూపమునున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
294)కామహాః -

కామములను అంతంచేయువాడు
కోరికలు తుదముట్టించువాడు
సాధుతత్వం కలిగించువాడు
వైరాగ్యం ప్రసాదించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
295)కామకృత్ -

సాత్వికవాంఛలు నెరవేర్చువాడు
కోర్కెలను తీర్చునట్టి వాడు
కామ్యసిద్ధి కలిగించువాడు
కోరినవి ప్రసాదించువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు