మోటివేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ గా ఈర్ల సమ్మయ్య

 కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మోటివేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ గా సోమవారం అర్హత పత్రాన్ని అందుకున్నారు.  ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 38 రోజులు ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారు. అలాగే శని, ఆది వారాల్లో రెండు రోజుల పాటు సికింద్రాబాద్ లోని మినర్వా గ్రాండ్ త్రీ స్టార్ హోటల్లో జరిగిన ఆఫ్ లైన్ శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచి, మోటివేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్ గా రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వనాథం, ఇంపాక్ట్ ప్రతినిధుల చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈర్ల సమ్మయ్య చాలాకాలంగా బడికి దూరమైన పేద కుటుంబాలకు చెందిన పిల్లల్ని చేరదీసి, వారిని, వారి తల్లిదండ్రులను మోటివేషన్ చేస్తూ బడిలో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను, వారి హాజరు శాతాన్ని గణనీయంగా పెంచుతున్నారు. మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలను బతికించారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంప నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ రాథోడ్ ఆధ్వర్యంలో 40 రోజులపాటు 40 అసైన్మెంట్లు, 20 టాస్క్ లు, 10 ఛాలెంజ్లు సమర్థవంతంగా పూర్తి చేశారు. మోటివేషనల్ తరగతులను ఎలా నిర్వహించాలో తర్ఫీదు పొందారు. మోటివేషనల్ స్పీకర్గా ఎదగడానికి అవకాశం కల్పించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రతినిధులకు ఈర్ల సమ్మయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోవు కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు మోటివేషనల్ తరగతులు నిర్వహిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
కామెంట్‌లు