216)స్రగ్వీ -
వాడనిపూమాల ధరించినవాడు
తగ్గనికీర్తిగలిగిన వాడు
వైజయంతిమాల ధరించినవాడు
హరిరూపమునందున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
217)వాచస్పతి రుదానిధీః -
విద్యలకు అధిపతియైనవాడు
వాక్కుయే నిధియైనట్టివాడు
వేల్పులకు ఒజ్జయైనవాడు
బృహస్పతియే తానైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
218)అగ్రణీః -
భక్తులకు దారిచూపించువాడు
ముఖ్యమైన వ్యక్తిగానున్నవాడు
గామిడి యైశాశించువాడు
పురప్రముఖుడై భాసిల్లువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
219)గ్రామణీః -
సకలభూతములకు నాయకుడు
గ్రామాధిపతిగా నున్నవాడు
సమూహ ముఖ్యుడైనట్టివాడు
గ్రామరక్షణ చేయునట్టివాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
220)శ్రీమాన్ -
ఉత్కృష్టమైన కాంతిగలవాడు
శ్రీలతో కూడియుండెడివాడు
స్థితిమంతుడైనట్టి వాడు
లక్ష్మికి ఆలవాలమైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి