సౌందర్య లహరి ; కొప్పరపు తాయారు
🌟  శ్రీ శంకరాచార్య విరచిత 🌟


నిమేషోన్మేషాభ్యాం ప్రలయముదయం యాతి జగతీ
తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే ।
త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రలయతః
పరిత్రాతుం శంకే పరిహృతనిమేషాస్తవ దృశః ॥ 55 ॥

తవాపర్ణే కర్ణేజపనయనపైశున్యచకితా
నిలీయంతే తోయే నియతమనిమేషాః శఫరికాః ।
ఇయం చ శ్రీర్బద్ధచ్ఛదపుటకవాటం కువలయం
జహాతి ప్రత్యూషే నిశి చ విఘటయ్య ప్రవిశతి ॥ 56 

55)ఓ ధరణీధరరాజన్యతనయా! నీవు కనురెప్ప వేయడం వలన జగత్తు కు ప్రళయం ఏర్పడుచున్నది.
ఈ జగత్తు మొత్తం  ప్రళాయానంతరం  ఉన్మేషం వల్ల ఉత్పన్నమైనది.ఈజగత్తును రక్షించడం కోసం
నీవు కనురెప్ప వేయడం మానేసావు కదా  తల్లీ !
56) ఓ అపర్ణా దేవి ! కనురెప్ప పాటు లేని మీనాలు
సర్వదా జలాల లో దాగి ఉంటాయి.. ఈర్ష్య అసూయ లేని నీ కనులు తమని గురించి 
నీ చెవులతో చెబుతావేమో అనుకుంటున్నాయి. శ్రీలక్షి అనే నీ నేత్రలక్ష్మి  తూర్పు తెలవారటం
తోకవాటాలు వలె బంధించినట్టు దళాలు గల  కలువ మురిసిపోతుంది. రాత్రి మళ్ళీతెరుచుకునీ వికసిస్తుంది కదా తల్లీ !
.🪷 ***🌟****🪷
🪷 తాయారు 🪷

కామెంట్‌లు