సమస్యా పూరణ ;- సాహితీసింధు ,పద్యగుణవతి సరళగున్నాల

 సమస్య:పలుకున తేనెలే చిలుక పల్మరు నిందలు వేసిరయ్యహో
----------------------------------------------------------------------------------
తలపున నంధకారమును తప్పుడుమాటలమోసకారికిన్
కలహపు మాటలాడుటయు కాంతల డెందము దోచువారికిన్
మెలికల నూపుతోడ చెలి మేనును దోచగజూచువారికిన్
పలుకున తేనెలేచిలుక పల్మరు నిందలు వేసిరయ్యహో
కామెంట్‌లు