కృషి ఉంటే! అచ్యుతుని రాజ్యశ్రీ

 శనివారం బడిలో మధ్యాహ్నం ఆటవిడుపుతో పిల్లలు టీచర్స్ గడుపుతారు.8వక్లాస్ పిల్లలు లీడర్స్ గా ప్రోగ్రాం తయారు చేస్తారు.5-6-7 క్లాస్ పిల్లలు సరదాగా క్విజ్ పదబంధం లో పాల్గొంటారు.ఆరోజు ప్రశ్న ..కృషి అనే పదం ఉపయోగించి వాక్యనిర్మాణం చేయాలి.తార పాటపాడింది" కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులు అవుతారు". శివా వాక్యప్రయోగం చేశాడు" కృషితో నాస్తి దుర్భిక్షం" .హరి అన్నాడు" నేను ఇలా కృషిచేసిన చేస్తున్న కొందరు వ్యక్తుల గూర్చి చెప్తాను.పశ్చిమబెంగాల్ కి చెందిన 16 ఏళ్ల శుభజిత్ బిస్వాస్ కుడిచేతి పై చిన్న కణితి లేచి అదికాస్తా కాన్సర్ గా తేలింది.రోజుకూలీలైన అమ్మ నాన్నలు దిగులు పడ్డారు.కుడిచేతిని డాక్టర్స్ తొలిగించితే ఆపిల్లాడు అధైర్య పడలేదు.ఫిబ్రవరి మొదటివారంలో జరిగే టెన్త్ బోర్డు పరీక్షలు ఎడం చేత్తో రాస్తున్నాడు.రెండునెలల సాధనతో అతను సాధించిన విజయం.ఆపిల్లాడు చాలా గొప్పవాడు అవుతాడని అంతా ఆశీర్వదించారు.ప్రధాని మోదీని కల్సి ఆయన ప్రశంసలు పొందిన కంతిలక్ష్మి మన వికారాబాద్ మహిళ.తడి పొడి చెత్తను ప్రతివారి చేత వేరువేరు గాచెత్తబుట్టల్లో వేయించింది.పంచాయితీవారు పొడి చెత్త నుండి ఇనుపగాజుసామాను సేకరించిఅమ్ముతున్నారు.తడిచెత్తను కుళ్లబెట్టి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు ఆమె కృషిని హుస్నాబాద్ జనాలు ప్రశంసించారు.అలా కుంతి లక్ష్మి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
ఇక ఘటకేస్కర్ మండలానికి చెందిన పిట్టల కృష్ణవేణి కేవలం 6 వేల రూపాయల తో సోలార్ డ్రయర్ తయారు చేసి కూరగాయలను ఎండ బెట్టి నిల్వ చేయడం విశేషంజగిత్యాల శిల్పి గుర్రం దయాకర్ బియ్యపు గింజలతో అయోధ్య రామమందిరం నిర్మాణం చేసి మూడు రికార్డులు పొందారు." పిల్లలు ఆసక్తి గా ఆమాటలు విన్నారు.టీచర్స్ పిల్లల్ని అడిగారు" ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు?" మేమంతా ప్రతిపని ఇష్టం తో చేస్తాం.కష్టం అనుకోము.ఇప్పుడు మేము ఆ స్ఫూర్తి దాతలు గూర్చి విన్నాం కాబట్టి పరీక్షలంటే భయపడం.మార్కులు రాకపోతే ఏడవం.ఫ్యాన్ కి వ్రేలాడం!" అంతే అంతా శభాష్ అంటూ చప్పట్ల తో అభినందించారు.పేరెంట్స్ కూడా సంతోషించారు🌷
కామెంట్‌లు