నా భావన! గంగరాజు పద్మజ మలక్ పేట హైదరాబాద్
ప్రేమికుల దినోత్సవం అని
ప్రేరేపించి ప్రజలను
దారి మళ్లించే భావం

సందేశాత్మక సందర్భాలను
స్మరించడం  తరించడం
ఆచరించడం  శ్రేయం
ఆవిషయాలు  ప్రయోజనకరంగా చేయడం ధ్యేయం

ప్రేమానుభూతి వ్యక్తిగతం
గోప్యమనుట  సత్యం
ఆఅనుభూతిని  సార్వజనీనం
చేయడం అనౌచిత్యం

ప్రపంచ చరిత్రను శోధన చేసి
చూపి తెలిపి ప్రకటించడం
స్ఫూర్తిదాయకం అని నా భావన

చుంబన పరిష్వంగన దుర్దినోత్సవాల  వ్యాధి
ప్రబలి పెద్దలను మంచమెక్కిస్తుంది మనోవ్యాధి

ఆప్రమాదాలనుండి తప్పించి
యువకుల మనోభావాలను
మంచి వైపు మరలించడం
విజ్ఞుల ప్రాజ్ఞుల అనుభవజ్ఞుల విధి🌹

ఇది నాస్వీయ కవిత.ప్రేమికుల దినోత్సవం పై నా అభిప్రాయం

గంగరాజు పద్మజ
9849132730( జి.వి.నాగేంద్ర)

కామెంట్‌లు