ప్రేమకు మరణం లేదు !! ?;- " కావ్యసుధ "
మనుషులను
 మనస్సులను
 కలిపేదే ప్రేమ
 విడదీసేది కాదు
 పెన వేసేది ప్రేమ
 ఆనందానికి
 అనుబంధానికి ప్రేమ
 ప్రేమ అనేది లేకుంటే
 బంధాలు ఉండవు - అను
 బంధాలు ఉండవు
 ఆత్మీయత పండుగ
 ఆనందం పొందదు

 ప్రేమకు జననమే  !
 ప్రేమకు మరణం లేదు.
 ప్రేమ సమరం ! 
 ప్రేమ అమరం !!

 ప్రేమ నిత్య వసంతం
 ప్రేమ నిర్మల ఉదకం
 ప్రేమ శ్రీగంధ పరిమళం
 ప్రేమ నయన మనోహరం

 ప్రేమలు లేని బ్రతుకు
 జగతిన్........!
 పశుతత్వమనిపించు
 ప్రగతిన్.......!

         " కావ్యసుధ "
      'వాజ్ఞ్మయ భూషణ'
      "సాహితీ శిరోమణి"
    'ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్'
9247313488 : హైదరాబాదు

కామెంట్‌లు