శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
316)విశ్వబాహుః -

విశ్వమంతటా బాహువులున్నవాడు
ప్రపంచం ఆక్రమించువాడు
బాహువులందు లోకమున్నవాడు
విశ్వరక్షణ చేయుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
317)మహీధరః -

భూమిని ధరించినవాడు
విశ్వభారము వహించినవాడు
ధరణికి ఆధారమైనవాడు
మహీధరుడై యున్నట్టివాడు 
 శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
318)అచ్యుతః -

మార్పులు లేనట్టివాడు
ఎట్టి వికారములులేనివాడు
ఎటువంటి అడ్డులేనివాడు
అచ్యుతునిగా వెల్గువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
319)ప్రధితః -

ప్రఖ్యాతిని పొందినట్టివాడు
ప్రధానముగా నిలిచినవాడు
ప్రాముఖ్యత కలిగించువాడు
ప్రముఖముగా నున్నట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
320)ప్రాణః -

అంతటా చైతన్యమిచ్చువాడు
ప్రాణులకు కదలికనిచ్చువాడు
జీవస్వరూపం తానైనవాడు
ప్రాణమందు నివసించువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు