సుప్రభాత కవిత ; -బృంద
ఇలకు దిగిన సిరిజ్యోతికి
ఇంపైన స్వాగతమిస్తూ
ఇనుడి రూపు ఎదలోపల
ఇముడ్చుకున్న సలిలం

ఇంతలేసి రేకులతో
ఇష్టంగా విరిసిన చిన్నిపువ్వుల
ఇచ్చకాలకు మురిసిపోతూ
ఇరుగట్లను మృదువుగ ముద్దాడె!

ఇపుడే పుట్టిన చిన్ని బాలుని
చుట్టుముట్టిన మేఘమాలలు
ఇన్ని కళలు ఎక్కడివని
అబ్బురంగా చూస్తున్నవి.

క్షణానికో రంగు మారి
నింగిదారి పయనించే
వెలుగు తేరుకు దారి ఇస్తూ
మనసు నింపుకుంటున్నవి

మోకరిల్లిన ప్రకృతికాంతకు
మోపుగ కృపను అందించగా
కాంచన కిరణములతో కరుణ 
కురిపించి మురిపించె దినకరుడు

రత్నమల్లె రవి నింగిని మెరవగ
అప్రయత్నముగ కరములు జోడించి
అంజలి ఘటించి తరించె
మనసు భూపాలమాలపిస్తూ  ...

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు