జననీ!;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
దీనులయెడ కృపజూపి
పాపుల దరిజేర్చి నీవు
లలిత మోహనమున
బాలల పెద్దల బ్రోచి
లక్షణముగ తోడునిలిచి
శ్రీలనిచ్చి కావుమా మము
దేవీ ధనలక్ష్మీ
వివిధ రూపముల దాల్చిన నీకు
నీరాజనమిడి కొలుతుము
వేదండమునెక్కి రావే జననీ!!
---------------------------------------


{వేదండము=ఏనుగు}
**************************************

కామెంట్‌లు