సౌందర్యలహరి ; కొప్పరపు తాయారు
 🌟 శ్రీ శంకరాచార్య విరచిత🌟

విశాలా కల్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయైః
కృపాధారాధారా కిమపి మధురాభోగవతికా ।
అవంతీ దృష్టిస్తే బహునగరవిస్తారవిజయా
ధ్రువం తత్తన్నామవ్యవహరణయోగ్యా విజయతే ॥ 49 ॥

కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం
కటాక్షవ్యాక్షేపభ్రమరకలభౌ కర్ణయుగలమ్ ।
అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరలా-
వసూయాసంసర్గాదలికనయనం కించిదరుణమ్ ॥ 50 ॥
49) తల్లీ! నీ చూపు విపులమై కళ్యాణి యై, దుర్జయమై, దయారస పూరి తమై, అవ్యక్త మధురిమై, లోపల వెడదయై,  రక్షకమై, విజయ కరమై, వెలయుట చేత నాయ పుణ్య నగరముల పేర్లచే పిలువదగినది యై, ఒప్పు చుండును.
50) అమ్మా! కవుల కవితా రూప గుచ్చం నుండి బహిర్గత మగునట్టి సుగంధ రసగుల కర్ణ స్థానాలను
విడనాడకుండుట చే భవదీయ కటాక్ష విక్షేప యుక్త వక్ర దృష్టితో చూడడం వల్ల భ్రమర సదృశ్యమై షడ్రసోపేతమై, రసిస్వాదన చేయుటకు విహ్వలమగునట్టి   చంచల నేత్రద్వయాన్ని చూసి ఈర్ష్యా సంసర్గం చే నీ తృతీయ నేత్రం ఈషదరుణా
ఋణ మగుచున్నది తల్లీ !
                  ***🌟***
🌟 తాయారు 🪷

కామెంట్‌లు