చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 తేటగీతి.
=======
పరమ తత్త్వమెఱుంగని కరి విభుండు
తన యుదరమందు శంకరున్ దాచియుంచె
వెఱ్ఱి బాగుల వానికి విశదపరిచి
పుణ్యగతుల నొసంగె నా పురహరుండు.//

కామెంట్‌లు