వోని పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవం


 రామన్ ఎఫెక్ట్ కనుగొన్న శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ అని, వారి సేవలు భారతదేశానికి గర్వకారణంగా నిలిచాయని వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అన్నారు. 
జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ప్రయోగాలు విద్యార్థుల ప్రతిభను చాటిచెప్పాయి. 
నీటిలో అగ్ని వెలిగించే, నీటికి నురగలతో పొంగు ఏర్పరిచే, నీటికి రంగు తెప్పించే ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. 
శూన్యం నుంచి శబ్ధ తరంగాలను నడిపించే ధ్వనివాహక ప్రయోగం అబ్బురపరిచింది. 
రాగి తీగ వెంబడి లైటు వెలగనీయకుండా పిన్స్ ను తీసుకెళ్ళే హేండ్ బ్యాలెన్స్ గేమ్ అందరినీ అలరించింది. గాలిమర పనిచేయు విధానం తదితర పలు ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. 
విద్యార్థులు కిశోర్, జశ్వంత్, యోగి, శ్రావ్య, కల్పన, సాయివర్ష, హేమంత్, వంశీ, వరుణ్ దివాకర్, లాస్యప్రియ, తనుశ్రీ, హిమజ, మౌనిక, సింధుప్రియ, మేఘన, ప్రేమ్ కుమార్, వినయ్, అభిషేక్ తదితరులు ప్రయోగాలు చేసి బహుమతులు పొందారు. 
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి, ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ, దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావులు పాల్గొన్నారు. 
అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు