పొదుపు మంత్రం నిత్యం జపించాలి; - సి.హెచ్.ప్రతాప్

 మారుతున్న ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే పిల్లల భవిష్యత్తు కోసం ఉత్తమ పెట్టుబడి ప్రణాళికలు చాలా అవసరం ఈ నేపథ్యంలో పిల్లల భవిష్యత్‌ కోసం రూ. 1 కోటి వరకు కార్పస్ ఫండ్‌ను నిర్మించవచ్చు. పిల్లల వయస్సు, భవిష్యత్తులో ఊహించిన అవసరాలను బట్టి తల్లిదండ్రులు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఎక్కువ కాలం పాటు ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.అర్థశాస్త్రంలో వ్యక్తిగతమైన పొదుపు అంటే వ్యక్తిగత ఆదాయం నుంచి వ్యక్తిగత వినియోగాన్ని తీసివేస్తే వచ్చే మిగులు.మరోరకంగా చెప్పాలంటే ఆదాయంలో వెనువెంటనే వస్తుసేవలకై ఖర్చు చేయని భాగమే పొదుపు. వ్యక్తులు కాకుండా పరిశ్రమలు లేదా సంస్థలు చేసే పొదుపును తమ ఆదాయ భాగంలో పన్నులు, డివిడెంట్లు, ఇతర ఖర్చులు పోగా మిగిలే భాగంగా నిర్వచించవచ్చు. ప్రభుత్వాలు చేసే పొదుపు అనగా బడ్జెటులో వచ్చే మిగిలు.జీవితంలో నిత్యం ఆర్థిక క్రమ శిక్షణ అనేది ఉండాలంటారు పెద్దలు. అప్పుడు అన్ని విధాలుగా జీవితందా సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచించాలి. భవిష్యత్తులో ఎదురైన ఖర్చుల కోసం ఇప్పటి నుంచి కాస్త సేవింగ్స్ చేస్తూ ఉండాలి. ఆర్థిక క్రమ శిక్షణను కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. ద్రవ్యోల్బణం, ఆదాయపు పన్ను, లక్ష్యాలకు తగిన పెట్టుబడి, వివిధ పొదుపు మార్గాలు, మదుపు గురించి సరైన అవగాహన ఉండాలి.మన ఆర్థిక లక్ష్యాలకు మనం చేసే మదుపునకు మధ్య సమన్వయం ఉండాలి. ఇది చాలా ముఖ్యం ఎందుకంటే అటు పెట్టుబడి మీద వచ్చే రాబడి, ఇటు మన అవసరాలు కూడా కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అందువల్ల మన ఆర్థిక లక్ష్యాలను కూడా మూడు రకాలుగా విభజించుకుని తగిన మదుపు మార్గాలు ఎంచుకోవాలి.మీ జీతం నుండి కనీసం ఇరవై శాతమైనా అత్యవసరాలుగా గుర్తించాలు. ఒక, అవసరాలకి ఓ నలభై శాతం కేటాయించుకోగా, కనీసం ముప్తైశాతం డబ్బుని వివిధ రూపాల్లో పెట్టుబడిగా, రాబడి పథకాల్లో మదుపు చేయాలి. ఇలా పొదుపు చేస్తే కచ్చితంగా మీ లక్ష్యాలు నెరవేరుతాయి.  
కామెంట్‌లు