అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం రోజున
నా మాతృ భాష అయిన కన్నడ గురించి చెప్పనా
నేను అందరితో మాట్లాడు తెలుగు భాష గురించి చెప్పనా
కన్నడ భాష ఆ ప్రాంతాల వరకే "పరిమితము"
కానీ తెలుగు భాష అన్ని ప్రాంతాలకు "సుపరిచితము"
కన్నడ భాష కస్తూరి "తిలకము"
తెలుగు భాష అన్నీ కలగలిసిన రంగుల "ఫలకము"
కన్నడ భాషలో నా మాటలు "ఒలుకు"
తెలుగు భాష లో నా కలము తీయని తేనెలు "చిలుకు"
ఎందరో మహా కవుల పరిచయ భాగ్యము కలుగ చేసిన జిలిబిలి "తళుకు"
నా మాతృ భాష గొప్పది అని అందరూ గర్వంగా చెప్తారు
నేను అందరితో మాట్లాడే భాష ఇంకా గొప్పది అని సగర్వముగ చెప్తాను
భావ కవితలు అయినా,శృంగార కవితలు అయినా,విప్లవ కవితలు అయినా,స్ఫూర్తి నిచ్చే కవితలు అయినా,చమత్కార కవితలు అయినా,మేల్కొలుపు కవితలు అయినా, నిద్ర పుచ్చే కవితలు అయినా,రచనలు అయినా, సీస పద్యాలు అయినా
అలఓకగా జారును తెలుగు కవుల
కలములో....
అందరూ చెప్పేదే
పరభాషా జ్ఞానాన్ని "సంపాదించు"
నీ మాతృభాష ని అందరికీ "పంచు"
తెలుగు రాని వారితో పరభాష లో మాట్లాడండి
తెలుగు వచ్చిన వారితో తెలుగులోనే మాట్లాడండి...
మీ భాష గౌరవాన్ని పెంపొందించండి
దేశ భాష లందు తెలుగు లెస్స...
ఏనాడో పలికిన లెస్స!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి