సౌందర్య లహరి - కొప్పరపు తాయారు
  🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟

అరాలా కేశేషు ప్రకృతిసరలా మందహసితే
 చిత్తే దృషదుపలశోభా కుచతటే ।
భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహవిషయే
జగత్త్రాతుం శంభోర్జయతి కరుణా కాచిదరుణా ॥ 93 ॥

కలంకః కస్తూరీ రజనికరబింబం జలమయం
కలాభిః కర్పూరైర్మరకతకరండం నిబిడితమ్ ।
అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే ॥

93) అమ్మా! భవదీయ కుండలాలలో కుటిలత్వాన్ని,
  చిరునవ్వులో మృదులత్వాన్ని, చిత్తంలో విరిసిన పూలకాంతిని, వక్ష స్థలంలో పాషాణ సదృశకాఠిన్యాన్నీ, నడుములో కౄరత్వాన్ని, కుచదేశంలో విశాలత్వాన్ని, నితంబ ప్రదేశంలో విస్తారాన్ని, అనిర్వచనీయమైన రక్తియందు ఆసక్తి 
గల పరమశివుని కరుణ జగద్రక్షాణార్థం సమర్థవంతం అవుతుంది కదా తల్లీ !
94) జగదేక సుందరీ !త్రిలోకజననీ! చంద్రుడి కళంకము, చంద్రబింబము కళలు, క్రమంగా కస్తూరి జల, కర్పూరాలు కాగా, వాటితో నింపినది  మరకత మాణిక్య మంజూష నువ్వు వినియోగించడం వల్ల బ్రహ్మదేవుడు ఈ పెట్టెను మాటిమాటికి నీకోసం ఉపయుక్త వస్తువులతో నింపుతున్నాడు కదా! తల్లి !
                   ****🪷***
🪷 తాయారు 🪷

కామెంట్‌లు