చిత్రస్పందన.- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర

 తేటగీతి.
-----------
నీలి వర్ణంపు మొయిళులు నీటియందు
ప్రతిఫలింపగా మెఱసెడి ప్రకృతి సొబగు
చూచు వారల హృదయముల్ దోచుచుండ
నడిచి పోవుచు భానుండు నవ్వుకొనెను.//
కామెంట్‌లు