సౌందర్యలహరి; - కొప్పరపు తాయారు
    🌟శ్రీశంకరాచార్యవిరచిత🌟

కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా ।
కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృంతం గిరిసుతే
కథంకారం బ్రూమస్తవ చిబుకమౌపమ్యరహితమ్ ॥ 67 ॥

భుజాశ్లేషాన్ నిత్యం పురదమయితుః కంటకవతీ
తవ గ్రీవా ధత్తే ముఖకమలనాలశ్రియమియమ్ ।
స్వతః శ్వేతా కాలాగురుబహులజంబాలమలినా
మృణాలీలాలిత్యం వహతి యదధో హారలతికా ॥ 68 ॥
67) ఓ గిరి శుతా ! ఉపమాన రహితమైన నీ చుబుకాన్ని మేమెలా వర్ణించగలం. దానిని నీ తండ్రియైన హిమాచలుడు వాత్సల్యంతో ,ప్రేమతో
తన వేళతో నిమిరాడు. గిరీశుడు, అధర పానాకులత్వం తో నీచుబుకాన్ని మాటి మాటికి
పైకి ఎత్తగా అది శంభుని హస్తాలతో మేము చూచు
కోడానికి ఎత్తిన అద్ధమా అన్నట్లుంది.ప్రకృతి ముఖం
దర్పణ సదృశ మైనది. అందులో మహాదేవుని వదనం ప్రతిబింబిస్తుంది కదా తల్లీ !
68) అమ్మా! త్రిపురాంతకుడైటువంటి శివుని కౌగిలింత వల్ల రోజూ రోమాంఛితమైనటువంటి ముఖ కమలము యొక్క ముక్కుకాడ అందంఅందంగాఉంది.ఎందు కంటే దాని కింద భాగమున తెల్లని ధై నల్లని బురద చేత మలినమై తీగ వంటి హారము తామరలత యొక్క లాలిత్యమును వహిస్తూ ఉన్నది కదా! తల్లి!
తెల్లనిదై నల్లని బురద చేత మలినమై తీగ వంటి హారము తామరలతో యొక్క వాయిస్తూ ఉన్నది కదా తల్లీ!
               ****🌟****
🌟 తాయారు 🪷

కామెంట్‌లు