శ్రీ విష్ణు సహస్రనామాలు ;-(బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
241)సత్కర్తాః -

సజ్జనులను సత్కరించువాడు
మంచిపనులను చేయువాడు
కర్తవ్యమునాచరించువాడు 
కర్మధారణము చేయుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
242)సత్కృతః -

పూజ్యులతో పూజింపబడువాడు
గొప్పవారిచే కీర్తింపబడువాడు
ఘనతవహించినట్టి వాడు
జ్ఞానవంతులు పూజించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
243)సాధుః -

ధర్మప్రవర్తన గలిగినవాడు
సాధుపుంగవుడైనట్టి వాడు
మునితత్వము నిండినవాడు
కారుణ్యం చూపించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
244)జుహ్నుః -

భక్తులకు మోక్షమునిచ్చువాడు 
పరమపదముకు నడిపించేవాడు
ముక్తిమార్గం చూపించువాడు
సత్యదర్శనం చేయించువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
245)నారాయణః -

నరులకు ఆశ్రయమిచ్చువాడు
సూర్యనారాయణుడైన వాడు
చంద్రుని అవతారమైనవాడు
అగ్నివలే వెలుగుచున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు