సౌందర్యలహరి;- కొప్పరపు తాయారు
🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟

నమోవాకం బ్రూమో నయనరమణీయాయ పదయో-
స్తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే ।
అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనామీశానః ప్రమదవనకంకేలితరవే ॥ 85 

మృషా కృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితం
లలాటే భర్తారం చరణకమలే తాడయతి తే ।
చిరాదంతఃశల్యం దహనకృతమున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలితమీశానరిపుణా ॥ 86
,85) అమ్మా ! శివానీ !భవదీయ చరణతాఢనాన్ని అభిలషించే పరమశివుడు ఉద్యానవనంలోని అశోక వృక్షాలను ఉద్దేశించి అసూయ పడుతున్నాడమ్మా!
చక్కని పారాణీతో అందెల రవళులతో అద్భుత దర్శనాన్ని ఇస్తున్న నీ చరణ కమలాలకు నేను ప్రణమిల్లుతున్నాను తల్లీ!
86) ఓ తల్లీ! పరమశివుడు అకస్మాత్తుగా మీరు మాట్లాడుకుంటున్నప్పుడు నీ గోత్రనామాన్ని ఎక్కడో చిన్న అక్షరం పొల్లు తప్పుగా ఉచ్చరించడం జరిగింది దానిని నీ ముందు ఉంచాలని ఆలోచిస్తూ నీ పాధపద్మంపై శిరస్సు వంచి ఆలోచిస్తున్నప్పుడునీ కాలి కాంతులు శిరస్సు పై పడినప్పుడు నీ
కాలిఅందెల అంచలనున్న మణిగంటలు చేసే సవ్వడి
అన్నమిషలో శివుడి తినేత్రంలో భస్మమైన మన్మధుడు చూసి కిలకిలా నవ్వుచున్నాడు!
                 ***🌟***
🌟 తాయారు 🪷

కామెంట్‌లు