సౌందర్య లహరి - కొప్పరపు తాయారు
🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟

యదేతత్ కాలిందీతనుతరతరంగాకృతి శివే
కృశే మధ్యే కించిజ్జనని తవ యద్భాతి సుధియామ్ ।
విమర్దాదన్యోఽన్యం కుచకలశయోరంతరగతం
తనూభూతం వ్యోమ ప్రవిశదివ నాభిం కుహరిణీమ్ ॥ 77 ॥

స్థిరో గంగావర్తః స్తనముకులరోమావలిలతా-
కళావాలం కుండం కుసుమశరతేజోహుతభుజః ।
రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే
బిలద్వారం సిద్ధేర్గిరిశనయనానాం విజయతే ॥ 78 ॥

77) అమ్మా! యమునా తరంగ సదృశంగా  సన్ననైన
    నీ నడుములో ఈషణ్మాత్రంగా ఉన్న నుగారు కలశాల వంటి భుజ మద్యం లోంచి సన్న నైనా బిలం వంటి నాభి రేఖాన్ని ప్రవేశించినట్లుగా పండితులు భావిస్తున్నారు కదా తల్లీ !
78) ఓ గిరి సుతా! నీ నాభి స్థిరమైన గంగావర్తంగాను,
మొగ్గల వంటి కుసుమలకు నుగారులతకు పాదు గాను, మన్మధుని శరీరానికి గుండం గాను, రతికి విలాస మందిరం గాను, శివుని నయన సిద్ధికి
కుహ్వరంగా. నుండి ఇది ఇదేనా అని భావించడానికి వీలుకానిదై, ఉన్నది అలారారు తున్నది కదా తల్లీ !
                    ***🌟****
🪷🌟 తాయారు 🪷

కామెంట్‌లు