ప్రభుత్వ పాఠశాల పిల్లలకు క్విజ్ పోటీలు


 పాఠశాల పిల్లలు విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచిని పెంచుకోవాలని
కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అన్నారు. బుధవారం ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విజ్ఞాన శాస్త్రం దినోత్సవాన్ని పురస్కరించుకోని పిల్లలకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సెమినార్లో ఆయన సర్ సివి రామన్ జీవిత విశేషాలను పిల్లలకు వివరించారు. పిల్లలు ఉన్నతాశయంతో ముందుకెళ్ళినప్పుడు విజయం సాధిస్తారన్నారు. పిల్లలు తగిన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని అమలు చేయాలన్నారు. అనంతరం పాఠశాలలో గణితం, పరిసరాల విజ్ఞాన శాస్త్రంలో పిల్లలకు క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులందజేశారు.
కార్యక్రమంలో హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు