తీర్చిదిద్దాలి;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 పసితనంలో శివాలయ ధ్వంసం చూసి
యువతిగా అనేక ఆలయాల విధ్వంసం చూసి
మొగులాయిల దౌష్ట్యాన్ని అసహ్యించుకుని
నరనరానా వారిపట్ల క్రోధాన్ని నింపుకుని
భరతమాతపట్ల మొగులాయిలు చేసిన
అపరాధాలను తన పుత్రునిద్వారా
తుదముట్టించిన భరతనారి
ఉగ్గుపాలతోనే తన పుత్రునిలో 
వీరత్వాన్ని నింపిన ధీశాలి
దేశాన్ని, ధర్మాన్ని, మహిళలను 
ఎలా గౌరవించాలో
తన పుత్రునికి నేర్పిన ఔదార్యమూర్తి
దేశంలో అనేక సంస్కరణలకు మూలహేతువై
తన పుత్రునిద్వారా వాటిని సాధించిన వీరనారి
తన పుత్రుడైన శివాజీని పరాక్రమశాలిగా
తీర్చిదిద్దిన గొప్ప మాతృమూర్తి
భారతదేశంలో ప్రతితల్లీ ఆనాటి
జిజియాబాయిలా తయారు కావాలి
తమ పుత్రులను ఛత్రపతి శివాజీ వంటి
వీరులుగా, త్యాగధనులుగా, 
దేశభక్తులుగా తీర్చిదిద్దాలి!!
**************************************


కామెంట్‌లు