నైతిక విలువల నిధి పిల్లల జాబిల్లి కథలు చదవడం ద్వారా పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించగల్గుతాము. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను అందించగలుగుతామని,అటువంటి గొప్పపనిని ప్రముఖ కార్టూనిస్ట్, కథా రచయిత అయినటువంటి  వడ్డేపల్లి వెంకటేష్ రచించిన పిల్లల జాబిల్లి కథాసంపుటి చేస్తుందని ఆవిష్కర్త మరియు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు తెలిపారు. బాలలకు చేరువైన చందమామ పిల్లల జాబిల్లి. చల్లని వెన్నెలలా మంచి విలువలను పిల్లల్లో పాదుకొల్పుతుందని విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరి రెడ్డి గారు ప్రస్తావించారు. నేటి పరిస్థితుల్లో బాలలకు వడ్డేపల్లి రచించిన కథల అవసరం ఎంతో ఉందని ప్రముఖ బాలల సాహితీవేత్త మేకల మదన్ మోహన్ రావు తెలపగా బాల సాహిత్యంలో మంచి పుస్తకం చేరిందని మన్నెం శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా రావిరాల అంజయ్య, పుస్తక సమీక్షకులుగా డాక్టర్ ఉప్పల పద్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కౌముది ప్రధాన కార్యదర్శి రాపోలు పరమేష్, చిలుకూరి బాలు, రామబ్రహ్మచారి, కర్నాటి నాగమణి, వెంకటేశ్వర్లు ,రేణుక, సైదాచారి,  భాస్కర్ రెడ్డి, నందికొండ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు