జైజై తెలుగు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తెలుగుకు
రంగుంది
రుచియుంది
రమ్యతయుంది

వివిధ
వర్ణాలలో
వెలుగులు
చిమ్ముతుంది

చక్కదనాలు
చూపిస్తుంది
సంతసాలు
కలిగిస్తుంది

కళ్ళను
కట్టేస్తుంది
విరులను
వీక్షించమంటుంది

పలుకులలో
తేనెలుచిందుతుంది
పెదవులకు
అమృతమందిస్తుంది

నోర్లలో
నానుతుంది
నాలుకలపై
నర్తిస్తుంది

అక్షరభక్ష్యాలు
తినిపిస్తుంది
ఆహ్లాదాలను
అందిస్తుంది

అందాలను
వర్ణిస్తుంది
ఆనందాలను
చేరుస్తుంది

షోకులు
చూపుతుంది
సంబరాలు
చేసుకోమంటుంది

మాటలు
మూటకడుతుంది
మదులను
ముట్టేస్తుంది

అందుకే
మనతెలుగు
వెలుగుతుంది
వ్యాపిస్తుంది

జైజై
తెలుగు
జయహో
తెలుగు


కామెంట్‌లు