సమర్పణ;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 చెలీ!
నీకోమాట చెప్పాలనుకుంటున్నాను
మనసుపెట్టి వింటావు కదూ!
సున్నితమైన నీ పాదాలు
అందమైన నీ వాలుచూపులు
సిగ్గుతో అరమోడ్పులయ్యే నీ కళ్ళు
చిరునవ్వుతో నిండిన నీ వదనం
ఉత్సాహపూరితమైన నీ హృదయం
మెరుపుకాంతితో నిండిన నీ దేహం
చందమామ వంటి నీ ముఖం
యువకులమదిలో ఆశలురేపే
ఓ కలల రాణీ!
నీవే నా వాకిట్లోకి వచ్చావు
మరి నేను నీకేమివ్వను బహుమతి?
నా హృదయమే అరచేతిలోపెట్టి
నీకు బహుమతిగా ఇస్తున్నాను సుమా!
నా జీవితాంతం 
నీ సేవకుడిగా 
నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను
నన్ను అనుగ్రహిస్తావు కదూ?! 
**************************************

కామెంట్‌లు