ప్రేమ...!!----శ్రీమతి సట్యగౌరి.మోగంటి- హైదరాబాద్
యుక్త వయసుకు కలలందం
ప్రేమికులకు అవగాహన అందం
ఆ ప్రేమ జీవితాంతం ఉండటం అందం

తూరుపు వాకిలికి తొలి వెలుగులందం
సాయంత్రానికి సంద్య వెలుగులందం
ఒకరికి ఒకరైన అనురాగ బంధం
విరిజల్లై కురిసిన అపురూప అందం

ఒకరి మోము మరొకరి కనులలో
వెలిగిపోయే వేళ
ఆ చూపుల మైమరపులు
అపురూపమైన అందం 

మనసులు ముడిపడి
మనువాడిన బంధం అందం
చిరుచిరు అలకలు,నవ్వులు
కలగలిసిన మధురానుబంధం

మమతలు పండిన మందస్మిత వదనం
మనసైన మకరందం
తియ తీయని జ్ఞాపకాల హరివిల్లందం
విడివడని బంధనాల సంకెళ్లు అందం

జన్మజన్మలకూ కావాలనిపించే
పరిపూర్ణ ప్రేమానుబంధం
అనురాగ సుధాభరిత సుగంధం
దాంపత్య బంధం
                   ***


కామెంట్‌లు
shri చెప్పారు…
చాలా బాగుంది సరళంగా సుందరంగా