మనసు;- యడ్ల శ్రీనివాసరావు విజయనగరం

 ఒక్క మాట చెబుతాను వినవోయి
నీవు నీవు గా నిండుగా వినవోయి
నీవు పలికినది నిజమని వినవోయి
అంతరింద్రీయ మదనం 
సముద్ర మదనం అవునోయి
మేఘం మధనం చేసే వర్షాలు కురుస్తాయి
మనసు మధనం చేస్తే ఆలోచనలు పుడతాయి
బీదవాడికి కనీస అవసరాలు తో సరిపెట్టుకుంటాడు
ధనికుడు పంచభక్ష పరమాన్నాలు తో సరిపెట్టుకుంటాడు
ఏది కావాలో తెలుసుకో ఓయ్
అంతరిక్షంలో సైతం
సముద్రం ఉండునా
ఇలా భూమండలంలో ఉండును కదా
జరగలేదని జరిగేట్లు ఊహించుకోకు
నిత్య నిజాలు సైతం మనసున కృంగదీస్తాయి
అద్భుతాలు పూర్ణాకృతి పొందితే
వ్యాధులు ఉండవు
నోటితో మాటలు చెప్పి
పైసలు సంపాదించుకునే
మనుషులు వంక చూడవద్దు
మానవత్వం పరిడమించాలి
సృష్టిలో మంచితత్వం పునరుద్ధరించబడాలి
అదే గాంధీ కలలు కన్న రాజ్యం
గుండె చప్పుడు ఎంతో తెలుస్తుంది అమ్మకి నాన్నకి
కన్నీటి బాధితులకి తెలుస్తుంది మనసుకి 
వ్యధకి మనసు కృంగిపోతే కన్నీరు కలదు
కన్నీరు చిందిస్తే అదృష్ట పంటలు కోసుకోయి
మరవకుండా తలచి నడిస్తే గమనం నీదే గెలుపు ఓయి
----------------------------------------
కామెంట్‌లు