భారతాంబ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్
 భాస్వంతము భరతజాతి సమస్తము
రమ్యము భారతావని సాంతము
తల్లజము ప్రపంచదేశముల కెల్లను
భావికముగా నాకమే యిది అనగా
గర్భమున ఘనరత్న రాశుల దాచిన
వరూధము దివిజవరులకు
తలవాకిలి భూమిజులకు నాకమై
రాఘవుడేలిన రామరాజ్యమిది
మనోజ్ఞమీ భరతఖండము
కారువు మలచిన దివ్య భవ్య దేశమిది
వ్యవసితమిది శాశ్వతమై వర్ధిల్లుననగా
ముదిమిలేని ముద్దరాలు మన భారతాంబ సుమీ!!!

{భాస్వంతము=దేదీప్యమైనది;రమ్యము=అందమైన;
తల్లజము=శ్రేష్టము;భావికముగా=స్వతస్సిధ్ధముగా;
వరూధము=గృహము;మనోజ్ఞము=సుందరము;
కారువు=విశ్వకర్మ;వ్యవసితము=నిశ్చయము}
**************************************

కామెంట్‌లు