హనుమంతుడు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 హనుమ మాటలు విన తరువాత సమాధానంగా  లక్ష్మణుని వంక చూసి చెబుతున్నాడు శ్రీరామచంద్రమూర్తి కారణం ఆయన ప్రథమ శ్రేణి  ఆంజనేయుడు  చతుర్ధ  శ్రేణి  కనుక ఆరోజుననే వాల్మీకి మహర్షి ఎవరు ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా మనకు తెలియజేశారు  సోదరా ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి అన్న అభిప్రాయం నీకు ఉన్నట్లయితే  ఇతని వెంట నడువు  అతని పద్ధతి గమనించినట్లయితే  మనిషికి మాట్లాడవలసిన తీరు తెలుస్తుంది అంటూ  మనం ఏదైనా ఒక విషయాన్ని గురించి చెప్పవలసి వస్తే  మొదట ఉండవలసిన లక్షణం స్పష్టత  అంటే అక్షర దోషాలు కాదు  నీవు ఏ విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నావో ఆ విషయాన్ని గురించిన పూర్తి సమాచారం నీకు తెలిసి ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని గురించి చెప్పవలసి వస్తే క్లుప్తంగా చెప్పాలి  సాగదీసి అదేదో కాయం లాగా కథ లాగా చెబితే బాగుండదు  పెద్దవారితో మాట్లాడేటప్పుడు ఎంతవరకు ఉండాలి  తనతో సమాన స్థాయిలో ఉన్న వారితో మాట్లాడేటప్పుడు  ఎలా ఉండాలి అన్న విషయాన్ని కూడా వాల్మీకి మహర్షి చెప్పారు  ఆంజనేయ స్వామి లంక నుంచి తిరిగి వచ్చినప్పుడు  విషయం అంతా నాలుగు వాక్యాలలో చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి  కి అదే తన స్నేహితులకు  అక్కడ తన కార్యక్రమాలన్నీ ఒక కావ్యం లాగా చెప్పారు  అదే సుందరకాండము  ఆ సుందరకాండను పారాయణం చేయమని మన పెద్దలు చెబుతూ ఉంటారు  దానికి కారణం ఇదే. సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడానికి బయలుదేరిన హనుమ  ఆమెను చూసి ఆమెతో మాట్లాడి తిరిగి వస్తూ ఆమెను చూశాను అన్న విషయం చెప్పడంలో కూడా  ముందు ఏది చెప్పాలి తర్వాత ఏం చెప్పాలి అన్న విషయం స్పష్టంగా ఉండాలి దూష్టా సీత  అన్నాడు  సీతాదుష్టా అన్నా  దుష్టాసీత అన్నా ఎలాంటి వ్యాకరణ దోషము రాదు  కానీ సీతా అనగానే చూశాడా లేదా అన్న అనుమానం వినేవాడికి వస్తుంది  ఆ ఒక్క క్షణాన్ని కూడా భరించలేడు  కనుక స్పష్టంగా చూశాను అన్నాడు  ఎవరిని చూశాడు  వెళ్ళింది సీతాదేవిని చూడడం కోసం అని అందరికీ తెలిసిన విషయమే కదా  కనుక దానిని వివరించవలసిన అవసరం లేదు  ఈ మాట చెప్పగానే  విలేవాడి హృదయం ఆనందంతో నిండి ఉంటుంది.

కామెంట్‌లు