తల్లి పెంపకం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 బిడ్డ ఏ వయసులో ఉన్నా  తన శరీరం ద్వారా చేయవలసిన కర్మ సక్రమమైన పద్ధతిలో  చేసే తీరును అమ్మ తెలియజేయాలి.  చిన్నతనంలో అతనికి తెలియదు కనుక అన్నీ తల్లి చేసి చూపిస్తుంది  ఊహ తెలిసిన తర్వాత అతను చేసే తప్పులను దిద్దుకుంటూ అతని చేత  సక్రమమైన పద్ధతిలో వెళ్లేలా చేస్తుంది. శరీరం బిడ్డ చెప్పు చేతల్లో ఉండాలంటే దానికి తగిన వ్యాయామం తప్పనిసరి అది ప్రత్యేకించి ఉదయం చేసినట్లయితే మంచి ఫలితాలను ఇస్తుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు  వారు చెప్పిన  పద్ధతిలో నడక కానీ  చిన్నగా యోగా కానీ ఆసనాలు కానీ  చెరువులో ఈతగాని  చేసినట్లయితే తన శరీరం తన అధీనంలో ఉంటుంది తాను అనుకున్న ఆనాటి కార్యక్రమాలు సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. అన్నిటికీ ప్రధాన కారణం మనస్సు  ముందు అది ఆరోగ్యంగా ఉన్నట్లయితే శరీరం మొత్తం  ఎలాంటి రుగ్మతలకు  ఆలోచించడంలో మంచిని గురించి మాత్రమే ఆలోచించాలి అలాంటి చెడు అభిప్రాయాలు మనసుకు రానివ్వకూడదు ఎప్పుడు చెడు తలంపు హృదయానికి వచ్చిందో  అప్పుడు శరీరం మొత్తం చెడుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తోంది  అలాంటి అవకాశం శరీరానికి ఇవ్వకూడదు  దానికి తన ప్రక్క ఉన్న మిత్ర బృందం కూడా  తోడవుతుంది  మంచి స్నేహితుడు దొరికినట్లయితే మంచి ఆలోచనలు చెడ్డవాడు దొరికినట్లయితే చెడ్డ ఆలోచనలు వస్తాయని  కనుక మంచి వారినే ఎన్నుకొని వారితో స్నేహం చేయమని తల్లి బిడ్డను ప్రోత్సహించాలి  అప్పుడు ఆ జీవితం సుఖవంతంగా ముందుకు సాగుతుంది  దీనికి సారథి తల్లి మాత్రమే. చిన్నపిల్లలయినా పెద్దవారైనా ఒక్కొక్కసారి వారు ఆలోచించిన దానికి విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తాయి  దానివల్ల మనసు వికలమవుతుంది  తాను చేయదలచుకున్న కార్యక్రమాలన్నీ  విఫలమవుతాయి  అలాంటి సమయంలో  రకరకాల ఆలోచనలు వచ్చి చివరకు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు  అలాంటి పరిస్థితుల్లో అమ్మ ఒక మంచి మిత్రునిలా తన దరిచేరి  ఎలా జరుగుతుంది నాన్న  అది ఇలా జరగడానికి కారణం మన ఆలోచన మనం చేసే పని  అది సక్రమంగా ఉన్నట్లయితే ఫలితం కూడా సరిగానే వస్తుంది  మనం చేసిన దాంట్లో ఎక్కడో లోపం ఉంది దానిని సరి చేసుకుని ముందుకు సాగాలి అని  అతనిని సక్రమమైన మార్గంలో పెట్టే బాధ్యత తల్లి స్వీకరించాలి  స్వీకరించి అనుసరిస్తుంది కూడా.

కామెంట్‌లు