బాధ్యత ;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 బిడ్డ ఏ వయసులో ఉన్నా  తన శరీరం ద్వారా చేయవలసిన కర్మ సక్రమమైన పద్ధతిలో  చేసే తీరును అమ్మ తెలియజేయాలి  చిన్నతనంలో అతనికి తెలియదు కనుక అన్నీ తల్లి చేసి చూపిస్తుంది  ఊహ తెలిసిన తర్వాత అతను చేసే తప్పులను దిద్దుకుంటూ అతని చేత  సక్రమమైన పద్ధతిలో వెళ్లేలా చేస్తుంది  శరీరం బిడ్డ చెప్పు చేతల్లో ఉండాలంటే దానికి తగిన వ్యాయామం తప్పనిసరి అది ప్రత్యేకించి ఉదయం చేసినట్లయితే మంచి ఫలితాలను ఇస్తుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు  వారు చెప్పిన  పద్ధతిలో నడక కానీ  చిన్నగా యోగా కానీ ఆసనాలు కానీ  చెరువులో ఈతగాని  చేసినట్లయితే తన శరీరం తన అధీనంలో ఉంటుంది తాను అనుకున్న ఆనాటి కార్యక్రమాలు సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది.అన్నిటికీ ప్రధాన కారణం మనస్సు  ముందు అది ఆరోగ్యంగా ఉన్నట్లయితే శరీరం మొత్తం  ఎలాంటి రుగ్మతలకు లోనుకాదు. ఆలోచించడంలో మంచిని గురించి మాత్రమే ఆలోచించాలి అలాంటి చెడు అభిప్రాయాలు మనసుకు రానివ్వకూడదు ఎప్పుడు చెడు తలంపు హృదయానికి వచ్చిందో  అప్పుడు శరీరం మొత్తం చెడుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తోంది  అలాంటి అవకాశం శరీరానికి ఇవ్వకూడదు  దానికి తన ప్రక్క ఉన్న మిత్ర బృందం కూడా  తోడవుతుంది  మంచి స్నేహితుడు దొరికినట్లయితే మంచి ఆలోచనలు చెడ్డవాడు దొరికినట్లయితే చెడ్డ ఆలోచనలు వస్తాయని  కనుక మంచి వారినే ఎన్నుకొని వారితో స్నేహం చేయమని తల్లి బిడ్డను ప్రోత్సహించాలి  అప్పుడు ఆ జీవితం సుఖవంతంగా ముందుకు సాగుతుంది  దీనికి సారథి తల్లి మాత్రమే. చిన్నపిల్లలయినా పెద్దవారైనా ఒక్కొక్కసారి వారు ఆలోచించన దానికి విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తాయి  దానివల్ల మనసు వికలమవుతుంది  తాను చేయదలచుకున్న కార్యక్రమాలన్నీ  విఫలమవుతాయి  అలాంటి సమయంలో  రకరకాల ఆలోచనలు వచ్చి చివరకు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు  అలాంటి పరిస్థితుల్లో అమ్మ ఒక మంచి మిత్రునిలా తన దరిచేరి  ఎలా జరుగుతుంది నాన్న  అది ఇలా జరగడానికి కారణం మన ఆలోచన మనం చేసే పని  అది సక్రమంగా ఉన్నట్లయితే ఫలితం కూడా సరిగానే వస్తుంది  మనం చేసిన దాంట్లో ఎక్కడో లోపం ఉంది దానిని సరి చేసుకుని ముందుకు సాగాలి అని  అతనిని సక్రమమైన మార్గంలో పెట్టే బాధ్యత తల్లి స్వీకరించాలి  స్వీకరించి అనుసరిస్తుంది కూడా.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం