పిట్ట కథలు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఈ రోజు పిల్లలకు  తల్లి పిట్ట కథలుగా  మంచి విషయాలను అర్థమయ్యేట్లు బిడ్డలకు చెప్పడం ప్రదానం. పిట్ట కథ అనే మాట ఎందుకు వచ్చింది  పిట్టా అంటే చిన్నది అని అర్థం  పిట్ట అంటే పక్షి అని ఇంకొక అర్థం లేదు  ఏ పక్షిని బోయవాడు చంపడం వల్ల  ఆడ మగ రెండు పక్షులు ఆకాశంలో హాయిగా విహరిస్తున్న సమయంలో  ఒక బోయవాడు  ఆ పక్షులలో ఒక పక్షిని చంపడం  రక్తం కారుతున్న ఆ పక్షిని చూస్తూ కన్నీరు కరుస్తూ దాని చుట్టూ తిరుగుతూ రెండో పక్షి విలపించడం  ప్రభాకరుడు అన్న మరో వేటగానికి  బాధాకరంగా తోయడం  ఆ వేటగాడు తపస్సులోకి వెళ్లి  వాల్మీకి మహర్షిగా మన ముందుకు రావడం ప్రపంచానికే ఆదర్శప్రాయమైన రామాయణ గ్రంధాన్ని అందించడం మన అదృష్టంగా   భావించాలి. రామాయణ కథా గమనంలో వాల్మీకి చెప్పిన ఒక విషయాన్ని మనం  సునిషిత పరిశీలనలో చూసినట్లయితే  వారు వాడిన ప్రతి  పేరుకు ప్రత్యేకత ఉన్నది ఆ పేరును వినగానే ఆ పాత్ర విశిష్టత ఏమిటో చదువరికి అర్థమవుతుంది  ఉదాహరణకి రాముడు  అనే పేరు రాగానే రమః అంటే రమించువాడు తన సుఖంతో పాటు ఇతరుల సుఖాన్ని క్షేమాన్ని సంక్షేమాన్ని కూడా చూసేవాడు అన్న అర్థం మనకు  తెలుస్తోంది  ఆయన ఏ ధర్మపథంలో జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాడో ఆయన మనో విశ్లేషణ కూడా వాల్మీకి మహర్షి  రామ శబ్దంలో  ప్రస్ఫుటం చేస్తారు  పంచాక్షరి అష్టాక్షరి లో ఉన్న  రెండు అక్షరాలను తీసుకొని రామ అన్న  గొప్ప అర్థవంతమైన పాత్రను సృష్టించారు వాల్మీకి మహర్షి  అందుకే ఇన్ని సంవత్సరాలు గడిచిన ఆ మహర్షిని మనం  గౌరవిస్తున్నాం పూజిస్తున్నాం.
ఏ గ్రంథమైనా చదివేటప్పుడు దానిలో ప్రధాన పాత్రలు చదువరికి జ్ఞాపకం ఉంటాయి  వాల్మీకి మహర్షి విరచితమైన ఈ రామాయణంలో అతి చిన్న పాత్రలు కూడా చిరస్మరణీయంగా చదువరుల హృదయాలలో శాశ్వతంగా నిలిచి ఉంటాయి  నిజానికి ఆ పాత్రలు ఒక నిమిషం 1 1/2 నిమిషాల పాటు మాత్రమే  మనకు ప్రధాన గ్రంథం లో కనిపిస్తాయి  ప్రత్యేకంగా చెప్పుకోదగినది  వాల్మీకి మనకు చెప్పిన అద్భుత  వ్యక్తి  హనుమ  అంజనీ దేవి కుమారుడు కనక ఆంజనేయ స్వామిగా మనం కీర్తిస్తాం  వాయుదేవుని కుమారుడు కనుక  పవనసుతుడు అని పిలుస్తాం  పవనము అంటే గాలి వాయువు  ఈ ప్రపంచంలో వ్యక్తులే కాక  క్రిమి కీటకాదులు కూడా గాలి లేకుండా జీవించలేవు  నీ గుండె సక్రమంగా పని చేయాలంటే నీ  ముక్కు ద్వారా గాలిని పీల్చి తీర్చవలసినదే.

కామెంట్‌లు