బాల బోధ;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 తర్వాత కన్నులు మూయలా అవసరం లేదా  అన్న మీ మాంస ఎదురవుతుంది  కనులు మూస్తే ఆ భగవత్ స్వరూపాన్ని ఎలా చూడగలవు  కనుక ఆ స్వామిని చూస్తూ ఓంకారనాదం చేస్తూ మనసును లగ్నం దాని పైనే కేంద్రీకరించి  ఆ భగవంతుని పాదాలను ఒకసారి తాకి నమస్కరించి రావాలి  ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు శరీరం అలసటకు లోనవుతుంది  కనుక బయటకు వచ్చిన తర్వాత ప్రక్కనే ఉన్న  విశ్రాంతి మందిరం ఉంటుంది అక్కడ కూర్చోవాలి అప్పటివరకు ఏమీ తినకుండా ఉన్న  ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసం పురోహితులు ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించాలి  అది తిన్న తరువాత కొంచెం సత్వం వస్తుంది అప్పుడు లేచి నీ ప్రయాణం కొనసాగించాలి ఈ శాస్త్రీయమైన  విధానాల్ని  అనుసరించినట్లయితే ఎలాంటి బాధలు లేకుండా వస్తావు  అని పెద్దల వువాచ.
పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు  అన్నది  నానుడి  ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమైన  భగవద్గీతను గురించి తెలియని వారు  భారతీయుడే  ఇతర దేశాలలో పాఠ్యాంశాలుగా కూడా  చేతను ఏర్పాటు చేస్తున్నారు అన్న విషయం అందరికీ తెలుసు  కానీ మనం మాత్రం దానిని అధ్యయనం చేయం దానిలో విషయ ప్రాధాన్యం ఏమిటో మనకు తెలియదు  అసలు గీత ఎందుకు రాయవలసి వచ్చిందో కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు.వ్యాసల వారు రణరంగంలో  శ్రీకృష్ణుడు అర్జునులకు చేసిన బోధ  700 శ్లోకాలతో  ఇది సాధ్యమేనా  అన్ని గంటల బోధ పూర్తయ్యేంతవరకు  వైరి సైన్యాలు యుద్ధం చేయకుండా ఆగుతాయా అన్నది  సామాన్యుని సందేహం.
వ్యాసులవారు  ఆంధ్ర మహాభారతాన్ని చతుష్టుపు శైలిలో వ్రాశారు అది అందరూ తెలిసిన విషయం  మరి భగవద్గీత ఆ శైలిలో ఉన్నదా  పునరపి మరణం పునరపి జననం  పద్ధతిలో శంకరాచార్యుల వారి  శైలి స్పష్టంగా కనిపిస్తోంది  భారతంలో వ్యాసుల వారు రాసినది  రెండున్నర శ్లోకాలు మాత్రమే  అందరూ చుట్టాలు వారిని నేను చంపలేను అని  భయపడుతున్న అర్జునునికి  ఆ భయాన్ని విడిచి చత్ర ధర్మాన్ని  చేపట్టి వ్యక్తం చేయకపోతే  సారధిగా ముందు నేను నిన్ను చంపి తరువాత వాక్యాలు శ్రీకృష్ణుని నోట వచ్చాయి  మరి ఇక్కడ 701 శ్లోకంతో  శంకరాచార్యుల వారు ఏడవ శతాబ్దంలో దీనిని వ్రాసిన దాఖలాలు చాలా కనిపిస్తున్నాయి  శంకరాచార్యులవారు భగవంతుడు ఉన్నాడు అని ఎక్కడా చెప్పలేదు  భగవతి దేవత మాత్రమే ఉన్నది అని  దేవి స్తుతులు రాశారు తప్ప  దేవుళ్ళు గురించి రాయలేదు.


కామెంట్‌లు