కవిత నా తోడు;- యలమర్తి అనూరాధ-హైదరాబాద్ -చరవాణి:924726౦206
కలం మొదటిసారి కదం త్రొక్కిన దినం 
తొలిసారి అక్షరాల వర్షం 
కాగితం నేలపై కురిసిన క్షణం 
పద్యాలు అల్లరి పిల్లల్లా మారిన చందం 
బుజ్జి బుజ్జి కుందేల్లు లా ఉరికిన
 నానీల సందడి నాటికల 
సంభాషణలులా వాక్యాలు 
నాట్యాల వల్లరి పెద్ద కుమార్తెలా న
వల ఒదిగిన మధుర క్షణం
అన్నీ.. అన్నీ.. ఎదను తడిపిన సంఘటనలే!
కామెంట్‌లు