త్రిజట;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 త్రిజట స్వప్నం చూస్తున్నప్పుడు స్నేహితురాళ్లు మెలుకునే ఉన్నారు కారణం రావణుడు అక్కడే ఉన్నాడు. అందుచేత త్రిజట ఎప్పుడు మేల్కొని వుందో ఎప్పుడు నిద్రించిందో స్వపాన్ని చూసిందో ఎవరికీ తెలియదు కనుక ఇది ఒక   ఆకస్మిక అకల్పకాలిక ఘటనగా భావించవలసినదే  భగవద్గీతలో స్థితప్రజ్ఞను గురించి చెప్పినట్లు లోకం నిద్రిస్తున్నప్పుడు జ్ఞాని మేలుకొనే ఉంటాడు. లోకం మేల్కొన్నప్పుడు జ్ఞాని నిద్రిస్తాడు సరిగ్గా ఇదే రీతిలో భవిష్య ద్రష్టా భూమిక నిర్వహించే త్రిజట స్వప్నం  అర్థ చేతన దీర్ఘ నిద్ర లేక యోగ నిద్రగా భావించాలి ఆమె స్వప్నంలో భవిష్యత్తులో జరగబోవు శ్రీరాముని విజయం కానీ రావణ సంహారం కానీ చూసిందో లేదో కానీ తర్వాత కొద్ది క్షణాల్లోనే రానున్న లంకా దహన కాండ హనుమంతుని ద్వారా జరగబోతున్నట్లు చూసింది. నిజానికి అశోకవనంలో ఉన్న హనుమంతుడు సీతా రామణుడు వీరి మనవస్థితి  వీరికి సంభవించబోవు పరిణామ దశాదృశ్యాలు స్పష్టంగా త్రిజట స్వప్నంలో  ముద్రించబడినవి  ఇంతే కాదు ఈ ముగ్గురి హృదయాలలో ఏదో ఒకే అంశగా  ప్రతిష్ఠుడైన రాముడు త్రిజట స్వప్నంలో కూడా ప్రత్యక్షమవుతాడు రావణుడు రాముడి నుంచి సీతను తన ప్రక్కకు లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటే దీనికి వ్యతిరేకంగా హనుమంతుడు సీతతో శ్రీరాముని ప్రతిబింబాన్ని చూస్తూ ఉంటాడు  ఇద్దరినీ త్వరగా కలపడానికే ఆరాటపడుతూ ఉంటాడు ఇద్దరూ సీతాదేవి సాంగత్యానికి ప్రభావితుడైన వారిద్దరి దృష్టి కోణాలు మాత్రం వేరు వేరు  ఈ మహా మండలం యావత్తు త్రిజట స్వప్న ఆకాశంలో స్పష్టంగా గోచరిస్తుంది. త్రిజట స్వప్నంలో చూసే విషయాలన్నిటినీ నిశిత పరిశీలన చేయవలసినవి  మొట్టమొదట త్రిజట తెల్ల బట్టలు తెల్ల ఆభరణాలు ధరించినది శ్రీరామ లక్ష్మణులను చూస్తోంది ఆ సమయంలో త్రిజట ఆకాశంలో నిరాహారంగా గడిచేటువంటి ఏనుగు దంతములు యొక్క దివ్య శిబిక మీద ఆసీనురాలై ఉంటుంది వేల గుర్రాలు ఆ శిబికను నడిపిస్తూ ఉంటాయి  త్రిజటకు తర్వాత శ్వేత వస్త్రధారుని అయిన సీత కనిపిస్తుంది. ఆ సీత సముద్ర మధ్య నుంచి పైకి ఎగసి వచ్చిన ఒక కొండమీద రామునితో అదే విధంగా వేంచేసి ఉంటుంది సూర్యునితో పాటే వెలుగుల భాశిస్తున్నారు  మరొక స్వప్నం రామలక్ష్మణులు అంతరిక్షంలో విహరిస్తూ శిబికను వదిలివేసి పర్వతారంలో ఉన్న పంచ దంతములు గల గజరాజు పై ఎక్కి కూర్చున్నారు.
కామెంట్‌లు