త్రిజట;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ఇంతలోనే రామలక్ష్మణులతో పాటు జానకి కూడా అక్కడికి చేరి వారితో కలిసి కూర్చుని ఉంది  ఈ విధంగా ఆకారంలో పర్వతం మీద ఉన్న ఏనుగు పై కూర్చున్న రాములు లక్ష్మణుడు సీత ముగ్గురు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నారు. తర్వాత సీతాదేవి తన పతి భుజాన్ని పట్టుకొని పైకి లేచి సూర్యచంద్రుడిని తన చేతులతో  ప్రక్షాళిస్తుంది  ఈ విధంగా ఆ గజరాజు సీతారామ లక్ష్మణలను తీసుకొని లంకానకరం పైకి వస్తారు కానీ అకస్మాత్తుగా ఈ గజరాజు స్థానంలో 8 వృషభరాజులు కనిపిస్తాయి  ఈ వృషభములు నడప గానున్న రథముపై సీతారాముడు ఆశీనుడైనారు తర్వాత సీతారామ లక్ష్మణులు సూర్యప్రభలతో వీరాజీలు పుష్పక విమానం ఎక్కి ఉత్తరం వైపు ప్రయాణం సాగించారు.
ఇది త్రిజట యొక్క మొదటి భాగం ఇందులో సీతారామ లక్ష్మణుల భావ గర్భిత శోభాయాత్ర వర్ణించబడి ఉంది ఈ స్వప్నంలో మొదట రామ లక్ష్మణులే కనిపిస్తారు తర్వాత సీత చివరకు ముగ్గురు కలిసి ఒకసారి వాళ్ళ వాహనం కూడా ప్రత్యేక దృశ్యంలో మారిపోతూ ఉంటుంది మొదటి అంతరిక్షంలో విహరించే దివ్య శిబిక మళ్ళీ సముద్రం మధ్య తెల్లటి పర్వతం దాని తర్వాత గజరాజు గజరాజు స్థానంలో వృషభములు చివరకు పుష్పక విమానం యాత్ర ఉత్తరం వైపు సాగుతుంది వీటిని నిషిత పరిశీలన చేసి తెలియజేయవలసినది ఏమిటంటే రామలక్ష్మణులు ఇడ పింగళా ప్రతికలు మరియు సీతమ్మ  సుసుమ్నకు ప్రాతినిధ్యం వహిస్తుంది గజరాజు వృషభ రాజు మనసు వాక్కులకు ప్రతీకలు పుష్పకవిమానం పురుషోత్తముని పరమపావన వాహనం ఈ వాహనమే ముముక్షువులకు పరాంగతిని ప్రసాదిస్తుంది. స్వప్నం యొక్క రెండవ భాగంలో పాప జీవనలు దుర్గతిని గురించి హృదయ విదారక వర్ణన చేయబడింది ఈ వర్ణనలో బోడిగుండు వారు శరీరం నిండా చమురు కలవారు మద్యం సేవించువారు కత్తుల హారాలు ధరించిన వారు ఎర్రని దుస్తులు ధరించిన రావణుని పుష్పత్తి విమానం నుంచి నేల మీదకు పడిపోవడం కనిపిస్తోంది అంతేకాదు ఎర్రచందనం ఎర్ర రంగు హారాలు నల్లటి దుస్తులు ధరించిన రావణాసురునికి ఒక స్త్రీ వచ్చి గట్టిగా ప్రక్కకు లాగి తీసుకొని పోతుంది గాడిద రథం మీద కూర్చుండ పెడుతోంది ఈ గాడిద వాహనం దక్షిణ దిక్కు వైపు ప్రయాణిస్తుంది. కొద్దిసేపటికి రాక్షస రాజు రావణుడు ఆ గాడిద మీద నుంచి కింద పడిపోతాడు కానీ మరుక్షణంలోనే వారు లేచి నిలబడతాడు సంప్రమాశ్చర్యాలతో రావణుడు  భయకంపితుడై పిచ్చివాడిగా వ్యవహరిస్తాడు.కామెంట్‌లు