ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 గంటం దొరను వెతికే ప్రయత్నంలో అతనికి ఇద్దరు భార్యలు అన్న సంగతి తెలిసి పెద్ద భార్యను  ఆమె కుమారుని  ముందుగా ఖైదు చేసి గంటం దొర జాడ చెప్పమంటూ   బాధించారు  దగ్గర బంధువులు అందరినీ కూడా పిలిచి వారందరినీ కూడా  హింసిస్తూ విషయాన్ని రాబట్టడం కోసం ప్రయత్నం చేశారు  చిన్న భార్య వీరి బారి నుంచి తప్పించుకొని పోయి  అరణ్యాలలో తిరుగుతూ  ఎక్కడ ఏమి చేస్తుందో తనకే తెలియని స్థితిలో ఉన్నది  తన నాయకుడు లేకపోయిన తర్వాత ఈ బ్రతుకు ఎందుకు  అన్న అభిప్రాయంతో తాను గంటం దొర  తరలి వచ్చిన విషయం  చాలా మందికి తెలియదు  ఎనిమిది మందిని తన వెంట పెట్టుకొని  నేను  ఏటి ప్రక్కన నిలబడి ఉన్నాను పోరాటానికి రమ్మని వెర్రి కేకలు వేసేసరికి  కొంతమంది సైనికులు వచ్చి చుట్టు ముట్టారు. చుట్టుముట్టిన సైనికులు చెట్టు చాటునదాగి కాల్పులు కొనసాగిస్తూ ఉండగా  వేరే వైపు నుంచి కాల్పులు  వీరులు నేలకు ఒరిగారు మిగిలిన వీరులు మెల్లగా తప్పుకున్నారు అదృశ్యమైపోయారు ఆ అడవిలో  గంటం దొర ఒంటరిగా కాలుస్తున్నాడు  సైన్యంలో ఉన్న కొందరిని చంపాడు  తుపాకీలో గుండ్లు అయిపోయినాయి వెనకకు వెళ్లడం మర్యాద కాదు  ముందుకు వచ్చి నిలిచారు. ఆ ధీర  విగ్రహాన్ని చూసి దొరలు భయపడిపోయారు  దగ్గరకు రావడానికి ఎవరికీ ధైర్యం లేదు  భయంతో కాల్చే తుపాకుల గుండ్లు ఒకటి కూడా అతనికి తగలలేదు  చివరికి ఒక గుండు అతని గుండెపై తగిలింది  గంటం దొర  భూమిపై ఒరిగిపోయాడు  రామరాజుకు జై అంటూ అరుస్తూ  వీర తార నేడు రాలిపోయింది అని అన్నారు అంతా. ఆంధ్రదేశంలో ఉన్న ఆబాల గోపాలం అశ్రుతర్పణ ఇచ్చారు   అల్లూరి నేతలచుకుంటూ  జానపదులు జనపదాలను పాడారు  జాను తెలుగులో అతని చరిత్రను చెప్పారు   పత్రికలు  స్పందించి ఎన్నో సందేహాలను  ప్రశ్నల రూపంలో ప్రభుత్వాన్ని అడిగారు  మన్య గ్రామంలో ప్రతి ఇంటి వారు తమ ఇంటి మనిషిగా తలచి ఎంతో భక్తితో దిన వారములు చేశారు  దేశభక్తులు తమ దేహ భాగంలో ఒకటి  కోల్పోయాం అంటూ పలికారు  సత్కవులు అతని  చరితనాలకించి కవితలు వండారు  శిడుముడు పలుకుల చిరుతప్రాయమునందే నా దేశం ఇది అని ఎవడు నడిచాడో  పుణ్యభారత భూమి పూర్వ వైభవం తెలియజేశాడో  దేశ భాషలోని  తియ్యదనాన్ని త్రాగి విదేశ భాషలను ఎవడు విడిచారో.

కామెంట్‌లు